గూడెం కొత్తవీధి మండలం సీలేరులో జన్కో SE కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉద్యోగులు నిరసన
గూడెం కొత్తవీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో SE కార్యాలయం ఎదుట భోజన విరామం సమయంలో సెంట్రల్ జేఏసీ పిలుపుమేరకు జెన్కో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జన్కో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఈ మేరకు సెంట్రల్ జేఏసీ దశలవారీగా ఆందోళన చేయడానికి కార్యాచరణ రూపొందించింది. మంగళవారం మధ్యాహ్నం భోజనం సమయంలో నల్లబ్యాడ్జిలు ధరించి తమ నిరసనను తెలియజేశారు