డోన్: పాఠశాలలో ఫీజులు తగ్గించాలని ఎంఈఓ కు డోన్ జర్నలిస్టుల వినతి
Dhone, Nandyal | Jun 17, 2026 నంద్యాల జిల్లా డోన్లో జర్నలిస్టుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల పిల్లలకు పాఠశాల ఫీజులు, పుస్తకాల ధరలు తగ్గించాలని కోరుతూ (ఎంఈఓ) ప్రభాకర్కు బుధవారం వినతి పత్రం అందజేశారు. పాత్రికేయుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాల యాజమాన్యాలు ఫీజులు, పుస్తకాల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈఓ వారి వినతిని పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు