నిజామాబాద్ సౌత్: గర్భిణీలు బాలింతలు మంచి పోస్టుకాహారం తీసుకోవాలి: నగరంలో పోషణ వారోత్సవాల్లో DWO రసూల్ బి
అంగన్వాడీ సెంటర్లలో మంచి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను చిన్నారులకు అందిస్తున్నారని మహిళా కమిషన్ సభ్యురాలు సూధం లక్ష్మి, DWO రసూల్ బి తెలిపారు. గర్భిణీలు బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని తద్వారా పోషక విలువలు పెరిగి పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. నగరంలోని సంజీవయ్య కాలనీలో గల కమ్యూనిటీ హాల్ లో పోషక వారోత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా బాలింతలకు శ్రీమంతుడు నిర్వహించారు.