కరీంనగర్: నా చావుకు కారణం ఎమ్మెల్యే , పోలీసులు, నాపై కేసు పెట్టిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం
కరీంనగర్ లో ఎలకల మందు తాగి బండారి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో ఆదివారం వైరల్ గా మారింది. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టుకుని తాను చనిపోవడానికి కారణాలు తెలిపాడు. గంగాధర మండలం హిమ్మత్ నగర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను బస్సు సౌకర్యం కల్పించాలని అడిగానని, బస్సు సౌకర్యం కల్పించలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నాకు మిల్ట్రీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి తిట్టాడని నేను కూడా తిట్టానని తెలిపారు. నాపై మిలిటరీ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పోలీసులు హింసించారని తెలిపారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు.