సంతనూతలపాడు: అమరావతి నగర్ లో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు మండల పరిధిలోని అమరావతి నగర్ లో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ కు స్థానిక మహిళలు సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ... అమరావతి నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి మహిళలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.