నంద్యాల జిల్లా కలెక్టర్ చొరవ చిన్నారి లక్ష్మీ ధన్సిక వైద్యానికి 22 లక్షలు మంజూరు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన లక్ష్మీ ధన్సిక అనారోగ్యంతో బాధపడుతోంది, చిన్నారి లక్ష్మీ దన్సిక బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ స్టెమ్ సెల్ థెరపీ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ ద్వారా లెటర్ అఫ్ క్రెడిట్ 22 లక్షలు మంజూరు చేయించారు, దీంతో కలెక్టర్ రాజ్కుమారి హర్షణ వ్యక్తం చేస్తూ చిన్నారి ఆరోగ్యంగా కోలుకొని భవిష్యత్తులో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు