జుక్కల్: నిజాంసాగర్ - అచ్చంపేట్ కు నాగమడుగు రహదారి బంద్ : నిజాంసాగర్ ఎస్సై శివకుమార్
నాగమడుగును వరద నీరు ముంచెత్తడంతో నిజాంసాగర్ - అచ్చంపేట్ కు రాకపోకలు నిలిచి పోయాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు 16, 20 బెడ్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగినంత వరకు ఇరు గ్రామాల ప్రధాన రహదారి నాగ మడుగు గుండా రాకపోకలు నిషేధమని ఎస్సై శివకుమార్ సూచించారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల కు నాగమడుగు వద్ద హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అచ్చంపేట్ కు వెళ్లాలనుకునే ప్రయాణికులు నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా మీదుగా తిరిగి వెళ్లాలని సూచించారు.