మాచారెడ్డి: ఆరేపల్లిలో 55 సీసాల లిక్కర్ పట్టివేత, ఒకరిపై కేసు నమోదు, చాటుగా లిక్కర్ అమ్మడం కొనడం చట్టరీత్యా నేరం : ఎక్సైజ్ అధికారులు
ఉమ్మడి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి మరియు కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి బి. హన్మతరావు ఆదేశాల మేరకు మరియు నమ్మదగిన సమాచారం మేరకు SHO కామారెడ్డి సిబ్బంది పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామములోని ఒక ఇంటిలో సోదాలు జరపగా ఒక కార్యక్రమం కొరకు తెచ్చిన Defence Liquor లభించింది. ఇంటి వద్ద మొత్తం (55) సీసాల Military Liquor లభ్యమైనది అని అన్నారు. నిందితుడు హన్మండ్లు పై కేసు నమోదు చెయ్యడం జరిగింది తెలియజేశారు. ఇలాంటి Non-Duty Paid Liquor, Defence Liquor కలిగి ఉండడం లేదా అమ్మడం చట్టరీత్యా నేరం ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.