జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం, 16 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని గడి వీధిలో ఒక పిచ్చి కుక్క స్వెర విహారం చేసింది. శనివారం సాయంత్రం దొరికిన వారిని దొరినట్లు కరిచి బీభత్సం సృష్టించింది. పిచ్చి కుక్క దాడిలో సుమారు 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా కుక్క దాడిలో మహమ్మద్ ఇబ్రహీం అనే యువకుడి కుడి కన్ను పై, ముక్కు పై తీవ్రంగా గాయలయ్యాయి. మరికొందరి చేతుల పై, కాళ్ళ పై పిచ్చి కుక్క జరిపిన దాడిలో గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆగ్రహించిన స్థానికులు ఆ పిచ్చి కుక్కను వెంబడించి చంపేసినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను తరలించాలన్నారు.