కనిగిరి పట్టణంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కనిగిరి పట్టణంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి కూడా తీసుకురావాలని, తనకు ఫోన్ కాల్ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.