నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో మద్యం మత్తులో బైక్ కు నిప్పు పెట్టిన యువకుడు
Nandyal Urban, Nandyal | May 11, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం-కొత్తూరు దారిలో మౌలాలి అనే యువకుడు మద్యం మత్తులో తన బైకు తగులబెట్టాడు. సమాచారం అందుకున్న సీఐ రాము, ఎస్సై జయప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఏకంగా 273 రీడింగ్ రావడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. మద్యం తాగి ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, మత్తులో డ్రైవింగ్ చేయడం నేరమని పోలీసులు హెచ్చరించారు.