నంద్యాల అర్బన్: ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు :నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | May 8, 2026
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఫరూక్ అన్నారు. శుక్రవారం నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.