జహీరాబాద్: శేరి నగర్ కాలనీలో వివాహిత ఆత్మహత్య , కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని శేరి నగర్ కాలనీలో ఉంటున్న గొల్ల స్వప్న అనే మహిళకు ఆమె భర్త గోల్డ్ లోన్ కట్టమని నాలుగు లక్షలు ఇవ్వగా ఆమె ఆ డబ్బులను పరిచయం ఉన్న శంకర్ కు ఇచ్చిందన్నారు. ఆమె భర్త ఆ డబ్బులను శంకర్ నుండి తిరిగి ఇవ్వమని అడగగా, చస్తే కూడా ఇవ్వను అని శంకర్ సమాధానం ఇవ్వడంతో మనస్థాపానికి గురైన స్వప్న ఇంట్లో ఎవరు లేని సమయంలో బుధవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.