నంద్యాల అర్బన్: మహానంది సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు తప్పిన ప్రమాదం
Nandyal Urban, Nandyal | May 8, 2026
నంద్యాల జిల్లా మహానందిలోని యోగాశ్రమం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం తప్పింది. వివాహ వేడుకకు కారులో వస్తున్న ప్రయాణికులు రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. వ్యవసాయ కళాశాల వరకు స్తంభాలు తొలగించకుండానే రోడ్డు వేయడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి స్తంభాలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.