నందికోట్కూరు: పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం హాజరైన ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఆదివారం మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు స్వయంగా యోగాసనాలు వేశారు,అనంతరం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు మానవ శరీరానికి ఎంతో ఉత్తమమైనవి అన్నారు,యోగా అనేది వ్యాయామం కాదు, జీవనశైలి. ఒత్తిడిని దూరం చేసి ఆనందాన్ని దగ్గర చేస్తుంది. యోగాను ప్రతి ఒక్కరం ఆచరిద్దాం.అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిప