నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో 18న అడిషనల్ కోర్టు ప్రారంభోత్సవం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో 18వ తేదీ అడిషనల్ కోర్టు ప్రారంభం కానున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శరభయ్య గురువారం తెలిపారు, ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు,బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు, ఈ అదనపు కోర్టు ఏర్పాటుతో కక్షిదారుల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు