ఉరవకొండ: బెళుగుప్ప సత్యసాయి మందిరంలో అఖండ భజన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ సత్య సాయి భజన మందిరంలో ఆదివారం ఉదయం నుండి అఖండ భజన కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సమితి భజన మండలి సభ్యులు నిర్వహించారు. నవంబర్ 23న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించే శ్రీ సత్య సాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని బెలుగుప్ప భజన మందిరంలో కూడా వంద భజన పాటలతో అఖండ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి నిర్వహించి తీర్థప్రసాదాలను భక్తులకు గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.