కడప: ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం యువతకు స్ఫూర్తిదాయకం: నీతి అయోగ్ జాయింట్ సెక్రెటరీ
Kadapa, YSR | Oct 29, 2025 ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం యువతకు స్ఫూర్తిదాయకం అని.. నీతీ ఆయోగ్ జాయింట్ సెక్రెటరీ, వైఎస్ఆర్ కడప ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ ప్రశంసించారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మణంలో ఉన్న పి-4 "స్టార్టప్ కడప హబ్" సెంటర్ నిర్మాణ పనులను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తోకలిసి కడప ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ.. ఆశించే స్థాయి నుండి శాశించే స్థాయికి ఎదగాలంటే ప్రతిఇంటి నుండి ఒక స్టార్ట్ అప్ ఎదగాలనే ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు