బనగానపల్లె: యాగంటి ఉమామహేశ్వర స్వామి కి నేత్రపర్వంగా పల్లకి సేవ
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. పల్లకిలో ఉత్సవ విగ్రహాలుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకితో ప్రాకార ఉత్సవం గావించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి.పాండురంగా రెడ్డి, ఆలయ ఛైర్మన్ మౌళీశ్వర రెడ్డి, పాతపాడు మహేశ్ రెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.