రాజేంద్రనగర్: మైలార్దేవ్పల్లిలో కాలిపోయిన ఓ స్కూల్ బస్సు దగ్ధం
ఓ స్కూల్ బస్సు కాలిపోయిన ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో జరిగింది. లక్ష్మీగూడ నుంచి బాంబే కాలనీకి వెళ్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో విద్యార్థులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.