వాంకిడి: ఎన్టీఆర్ నగర్ కాలనీలో చేరిన వరద నీరు
రెబ్బెన మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శనివారం రెబ్బెన మండలంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాలనీ రహదారి జలమయంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి అని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.