నంద్యాల అర్బన్: మసీదుపురంలో విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురంలో విద్యుత్ ఘాతంతో ఓ పాడి గేదె మృత్యువాత పడింది.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు కాకునూరు ప్రసాద్ రెడ్డి పొలంలో కరెంట్ వైర్ తెగిపడింది. ఆ ప్రాంతంలో గడ్డి మేసేందుకు వెళ్లిన పాడి రైతు ముత్యాల కరుణక్కకు చెందిన గేదె కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది