కొత్తగూడెం: కళా ఉత్సవ్ విజేతల జాతి స్థాయిలో రాణించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జిల్లాస్థాయిలో విజేతలై రాష్ట్రస్థాయికి ఎన్నిక కాబడిన కళా ఉత్సవ విజేతలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించి జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం అన్నారు.జిల్లాస్థాయి కళా ఉత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కళలు పిల్లలలో మానసిక ఆనందాన్ని నింపడమే కాక అనేక రకాలైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని,మన సంస్కృతి సాంప్రదాయాలకు వారదులుగా నిలబడతారని తెలిపారు.