ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలం నల్లమల అడవి ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎగువ అహోబిలం నల్లమల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు, దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్లే రోడ్డు లోని ఓం నమో నారాయణ టర్నింగ్ వద్ద పట్టపగలే ఎలుగుబంటి సంచరించడంతో వాహనాల్లో వెళ్లే భక్తులు వీడియో తీశారు, కొద్దిసేపటి తర్వాత ఎలుగుబంటు అడవిలోకి వెళ్లిపోయింది