రాప్తాడు: రామకృష్ణ కాలనీలో భవన కార్మికుల సమస్యలు పై కలెక్టరేట్ వద్ద నిర్వహించే కరపత్రాలను ఆవిషర్మిక భవన కార్మిక సంఘం నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని రామకృష్ణ కాలనీలో గురువారం ఒకటిన్నర గంటల సమయంలో భవన కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ రామాంజనేయులు ఆధ్వర్యంలో నవంబర్ 30న భవన కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమ వెల్ఫేర్ బోర్డును రద్దు చేయడం జరిగిందని టిడిపి ప్రభుత్వం వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని భవన కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.