డోన్: డోన్ లో ఆగని దొంగతనాలు, భయాందోళనలో ప్రజలు
Dhone, Nandyal | May 25, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి స్థానిక పూల మార్కెట్లో పలు దుకాణాల్లో దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు కొంత నగదును ఎత్తుకుపోయినట్లు బాధితులు తెలిపారు. షాప్ యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు