ఈడిగిపల్లి వద్ద బొలేరో వాహనం ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
ఈడికిపల్లి వద్ద ఆదివారం రాత్రి 7:30 ప్రాంతంలో బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుంగనూరు మండలం బోడెవారిపల్లి చెందిన గణేష్ 26 రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా బొలెరో వాహనం ఢీకొనడంతో గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ గణేష్ ను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగం వైద్యులు అతనికి ప్రథమ చికిత్సల అనంతరం అతను పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు బెంగళూరుకి మెరుగైన వైద్యం కోసం తరలించారు.