ఖైరతాబాద్: చాదర్ ఘాట్ లో పర్యటించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాల
చాదర్ ఘాట్‌లోని ముసానగర్,శంకర్‌నగర్ వరద ప్రభావిత ప్రాంతాలను మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బంది వరద బురదను వాటర్ప్రైజర్తో క్లీనింగ్ చేస్తుండగా, దోమల పెరుగుదల, అంటువ్యాధులు నివారణకు శానిటేషన్ పనులు చేపట్టించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు