అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తపోవనంలో దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం నగరంలోని తపవనంలో ముందుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ఢీకొన్న ఘటనలో మర్తాడు గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.