రాజేంద్రనగర్: ఇబ్రహీంపట్నంలో కురిసిన వర్షం
ఇబ్రహీంపట్నంలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ కాస్తూ ఉక్కపోతతో ఇబ్బంది పెట్టింది. మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసింది. చిరు వ్యాపారుల సామగ్రి తడిసిపోయింది. ఆకాశమంత మేఘావృతమై అప్పుడప్పుడు ఎండ, అప్పుడప్పుడు వర్షంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.