జహీరాబాద్: హుగ్గేల్లి అక్రమంగా తరలిస్తున్న 295 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి ఎక్స్ రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం జహీరాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం పోలీసులు సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం ఎలాంటి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తుండగా వాహనాల తనిఖీ చేపట్టి పట్టుకున్నారు. పట్టుకున్న లారీలో 295 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభించాయని, వాటి విలువ సుమారు 9 లక్షల 50 వేల వరకు ఉంటుందన్నారు. అక్రమ రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కాశీనాథ్ తెలిపారు.