కర్నూలు: ప్రైవేట్ పాఠశాలల అధికారం దుర్వినియోగం – ఎస్ఎఫ్ఐ ఆగ్రహం
దీపావళి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న భాష్యం, గుడ్ షెఫర్డ్, సెయింట్ జోసెఫ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులపై ఒత్తిడి పెడుతున్న పాఠశాలలపై విద్యాశాఖ స్పందించాలని ఉపాధ్యక్షుడు ఆర్య హెచ్చరించారు. లేకపోతే విద్యార్థులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.