హత్నూర: హత్నూర మండల వ్యాప్తంగా వందేమాతరం 150 వసంతాల వేడుకలు, పాల్గొన్న డిప్యూటీ తహసిల్దార్ దావూద్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండల వ్యాప్తంగా వందేమాతరం150 వసంతాల వేడుకలు నిర్వహించగా హత్నూర తహసిల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తాసిల్దార్ దావూద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. బోరుపట్ల పాఠశాలలో బిజెపి ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బేగరి నాగరాజు, కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ వందేమాతరం దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.