బేతంచర్ల మండల ప్రజలు ఆందోళన చెందవద్దు : బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | Apr 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని డీజిల్, పెట్రోల్ వాహనదారులు ఆందోళన చెందవద్దని తహశీల్దార్ నాగమణి సూచించారు. ఈ రోజు సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంక్లకు ఇంధనం సరఫరా అవుతుందన్నారు. ఈ ఒక్కరోజు అవసరానికి మాత్రమే ఇంధనం తీసుకోవాలన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం పూర్తిగా నిషేధించామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.