బనగానపల్లె: రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమ వైసిపి నాయకులకు సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నాయకులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమకు ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. సోమవారం కోవెలకుంట్ల మండలం బిజీనివేముల గ్రామం గోవింద గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్ సిసి రోడ్లు సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు