నందికోట్కూరు: ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ట్రాక్టర్ నడిపి సందడి
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో సోమవారం నంద్యాల ఎంపీ డాక్టర్ పాల్గొన్నారు, నేలతల్లి, ఎడ్లు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి విత్తనం గొర్రు పట్టి స్వయంగా ట్రాక్టర్ నడిపి వ్యవసాయ పనులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డిశబరి శ్రీకారం చుట్టారు, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు ఆనందమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఎంపీ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు