సంతనూతలపాడు: నాగన్నపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు మండలం నాగన్నపాలెం గ్రామంలో ఉపాధిహామీ పధకం కింద పండ్ల తోటలో డ్రాగన్ ఫ్రూట్ మెక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్ డ్వామా పిడి జోసఫ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డ్వామా PD జోసెఫ్, ఎంపీడీఓ జ్యోతి, Apo ధనుజయ్, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.