నరసరావుపేటలో మున్సిపల్ టౌన్ ప్లాన్ అధికారి సాంబయ్య పై చర్యలు తీసుకోవాలి ప్రజా సంఘాలు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రజా సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. పట్టణంలో సమాచార హక్కు చట్టం ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య సర్వీస్ రికార్డులు ఆస్తులు వివరాలు ఇవ్వాలని కోరగా లేవని చెప్పడం సరైన నిర్ణయం కాదన్నారు. సాంబయ్య పై అనేక అక్రమాల ఆస్తుల పెరుగుదల ఆరోపణలు ఉన్నాయని పట్టణంలో చెరువులు డ్రైనేజీ కాలువల ఆక్రమణలకు అతనికి సంబంధం ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు హనుమంతరావు శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు నవీన్ పాల్గొన్నారు.