తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ బైపాస్ వద్ద గురువారం బ్రేక్ డౌన్ అయిన లారీని రోడ్డు పక్కన నిలిపి రిపేర్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. క్లీనర్ బ్రేక్ ప్యాడ్ను రిపేర్ చేస్తుండగా, అతని చేతి వేళ్లు బ్రేక్లో ఇరుక్కోవడంతో గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడికి సహాయం చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదన్నారు.