ఒంగోలు అర్బన్: పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 80 ఫిర్యాదులు*
Ongole Urban, Prakasam | Jul 13, 2026
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్ మరియు పోలీసు అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)”కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచి వ్రాతపూర్వక వినతిపత్రాలు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు, వారితో ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలను విని, సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.