కోడుమూరు: కోడుమూరు మండలం కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయి ట్యాంకర్ ను ఢీకొన్న లారీ
కోడుమూరు మండలం కొత్తూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి నుంచి గడివేముల వైపు స్లాగ్ లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు ఆగి ఉన్న ట్యాంకరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. లారీ ముందుభాగం ధ్వంసమైంది. ఎదురుగా వస్తున్న లారీని తెప్పించే క్రమంలో అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు డ్రైవర్ విజయ్ తెలిపారు.