సిర్పూర్ టి: దాహేగం మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ బాకీ కార్డులపై ఊపందుకున్న బిఆర్ఎస్ ప్రచారం
దాహేగం మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పై బిఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాకీ కార్డులను ఆవిష్కరించగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో సిర్పూర్ నియోజకవర్గం లో బాకీ కార్డుల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులపై ప్రచారం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని టిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు,