డోన్: బేతంచెర్ల మండలంలో బైక్ పై నుండి పడి మహిళ మృతి
Dhone, Nandyal | Jul 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద శనివారం విషాద ఘటన జరిగింది. బుగ్గానిపల్లికి చెందిన లక్ష్మీదేవి తన భర్త గోవింద్, కుమారుడితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. బైకుపై తిరుగు ప్రయాణమయ్యారు. ఆలయం నుంచి కొంతదూరం రాగానే ఆమెకు కళ్లు తిరిగి బైకుపై నుంచి పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్ల వైద్యులు తెలిపారు