బనగానపల్లె: పెట్రోల్,డీజిల్ బ్లాక్ మార్కెట్లో అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎవరైనా పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్లో అమ్మినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని బనగానపల్లె ఆర్డిఓ నరేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనగానపల్లె రెవెన్యూ డివిజన్లో పెట్రోల్ కొరత లేదని రెండు మూడు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఉందని తెలిపారు. వాటికి కూడా త్వరలోనే ఇంధనం రానున్నట్లు తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్లొద్దని కోరారు