పోచంపల్లి: జూలూరు లో లెవెల్ బ్రిడ్జిని పరిశీలించిన రాచకొండ సిపి సుధీర్ బాబు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారి
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, జూలూరు సమీపంలోని మూసీ నది హైదరాబాదులో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తూ లో లెవెల్ బ్రిడ్జి పై నుండి వెళ్తుండడంతో రాచకొండ సి పి సుధీర్ బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈరోజు, రేపు అతి భారీ వర్షాలు కురువనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదని హెచ్చరించారు. లో లెవెల్ బ్రిడ్జి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా బారిగేట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సిపి సుధీర్ బాబు ఆదేశించారు.