వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే శేషారావును మర్యాదపూర్వకంగా కలిసిన నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్
ఎన్నికల్లో ఉమ్మడి కృషితో విజయం సాధించి నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఉండ్రాజవరం మండలం వేలివెన్నులోని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటికి వెళ్లారు. ఆయనకు శేషారావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.