వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, (అక్టోబర్ 27 నుండి 28 వరకు) అన్నమయ్య జిల్లాపై "మొంథా" తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ రెండు రోజులు అతి భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు అత్యవసరంగా ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. వదంతులపై ఎస్పీ గారి కఠిన హెచ్చరిక:* "ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా, తుఫాన్ తీవ్రత గురించి తప్పుడు సమాచారాన్ని, వదంతులను సోషల్ మీడియా వాట్సప్ ,ఫేస్ బుక్ ఇన్స్ట్రాగ్రామ్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా వ్యాప్తి చేసినట్లు మా దృష్టికి వస్తే, వారిపై జిల్లా పోలీస్ శాఖ తరపున