బనగానపల్లె: బనగానపల్లెలో మంత్రి పయ్యావుల కేశవ్ కు ఘన స్వాగతం పలికిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా డీడీఆర్సీ సమావేశానికి ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు మంత్రి పయ్యావుల కేశవ్ వచ్చారు. ఆయన బనగానపల్లెలోని మంత్రి బీసీ స్వగృహానికి చేరుకోగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం నంద్యాల జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు మంత్రులు చర్చించారు.