డోన్: బేతంచర్ల మండలంలో ఓ మహిళ ఆత్మహత్య
Dhone, Nandyal | May 3, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన అరిగెల శిరీష (37) అనే మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బేతంచెర్లకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యం, కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.