ఆళ్లగడ్డ: గోవింద పల్లెలో మామ పై అల్లుడు కత్తితో దాడి
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల పరిధిలోని గోవింద పల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాలతో మామ ఇట్టే వెంకటేశ్వర్లు, ఆయన కుమార్తె సంజమ్మపై అల్లుడు చంద్రశేఖర్ కత్తితో దాడి చేసినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు, ఈ ఘటనలో ఇట్టే వెంకటేశ్వర్లు సంజమ్మకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కొరకు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎస్సై మధుసూదన్ కలిసి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ వెల్లడించారు